young-begger-mother-with-child

ఆకలి అన్న వాళ్లకు మాత్రం…పెట్టేడు అన్నం పెట్టడం మన ధర్మం.

Inspirational Story on Beggars.

నేను ఒకరోజు ఆఫీస్ కి లంచ్ బాక్స్ తీసుకపోకపోవడంతో ఆ రోజు తిందామని లంచ్ టైం లో బయటికి వచ్చా.
నేను తింటూ ఉండగా ఒక చిన్న అబ్బాయి వచ్చి ఫుడ్ అడుకుంటున్నాడు,డబ్బులు కాదు ఫుడ్ మాత్రమే అడుకుంటున్నాడు.
నేను ఆ బాబుకి ఫుడ్ ఇప్పించాను.అతను థాంక్స్ అన్నట్టు చెప్పాడు అతని సంతోషాన్ని షేర్ చేసుకుందామని అతన్నే చూస్తున్నాను, ఇంతలో ఆ పిల్లాడు ఆ ఫుడ్ తీసుకొని దగ్గర్లో ఉన్న వాల్లమ్మ దగ్గరికెళ్ళి ఆ ఫుడ్ ని ఆమే సంచిలో వేసాడు.
అది చూసి నేను కొంత అప్సెట్ అయ్యా.ఆమె దగ్గర్లోనే ఉండటంతో ఉండపట్టలేక ఆమే దగ్గరికి వెళ్ళి నీ పిల్లలని ఇలా అడుక్కోవడానికి ఎందుకు పంపుతున్నావ్ అని అడిగేసా,ఆమె ఒల్లో ఒక చిన్న పాపకూడా ఉంది. 

దానికి ఆమె సమాధానంగా నాకూ నా పిల్లలు అడుక్కుంటే చూడ్డం ఇష్టముండదూ.నాకేకాదు ఏ తల్లికీ ఉండదూ.
నా ఆరోగ్యం బాగాలేదు,పొద్దటినుండి ఎవరైనా సహాయం చేస్తారేమో అని అడుక్కుంటూనే ఉన్నా,ఎవ్వరూ చేయలేదు కనీసం వినలేదు.తిండి లేక నా పాపకి పాలు కూడ ఇవ్వలేదు.ఇంక నాకు ఓపిక లేక ఇక్కడ కూర్చొని పిల్లాన్ని పంపిచ్చా అని చెప్పింది.ఆమే అలా చెప్పగానే జీవితంలో కొందరు వ్యక్తుల ద్వారా కొన్ని నేర్చుకోవాలి అనిపించింది.ఎందుకంటే అలా ఆమేను చూసిన మనలాంటివాల్లం ఆమే అడుక్కోవడానికి డ్రామా ఆడుతుంది అనుకుంటాం.అడుక్కునే వాల్లు ఎప్పుడూ అలా డ్రామా చేసుకుంటూ అడుక్కుంటారు అనుకుంటాం కాని కొందరికి మాత్రం పరిస్తితులు అలా కల్పిస్తాయ్.

చేయి చాచి డబ్బులదిగే వాళ్లకు డబ్బు ఎవ్వకున్న పర్వాలేదు కాని ఆకలి అన్న వాళ్లకు మాత్రం…పెట్టేడు అన్నం పెట్టడం మన ధర్మం.

Young beggar-mother-with-child
Young beggar-mother-with-child

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top