Mother better than God

Telugu Inspirational Story on God.

ఓ కనస్ట్రక్షన్ సూపర్ వైజర్… 16 వ ఫ్లోర్ నుంచి క్రింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వర్కర్ ని పిలుద్దామని ప్రయత్నిస్తున్నాడు..
కానీ ఆ శబ్దాలకు…ఈ సూపర్ వైజర్ పిలుపు అతనికి వినపడటం లేదు
అతని అటెక్షన్ కోసం… ఏం చేయాలా అని ఆలోచించి
ఓ పది రూపాయల నోటు ని క్రిందకు విసిరాడు..ఆ వర్కర్ మీదకు
ఆ వర్కర్…దాన్ని తీసుకుని జేబులో పెట్టుకుని,కొద్దిగా కూడా తల పైకి ఎత్తకుండా కంటిన్యూ చేస్తున్నాడు
దాంతో ఈ సారి..పెద్ద మొత్త ఓ 500 నోటుని క్రిందకి పడేసాడు…అప్పుడు కూడా వర్కర్ సేమ్ ఫోజ్…ఏం పట్టించుకోకుండా సీరియస్ గా దాన్ని తీసుకుని జేబులో పెట్టుకుని పనిచేసుకుంటున్నారు.
ఒళ్లు మండిన సూపర్ వైజర్ ..ఇది కాదు పని అని…ఓ చిన్న రాయి తీసుకుని వర్కర్ మీదకు విసిరాడు….
ఈ సారి ..ఆ దెబ్బ తిన్న వర్కర్..తల పైకెత్తి ఎవరు విసిరారా అని కోపంగా చూసాడు…అప్పుడు పైన సూపర్ వైజర్ కనపడ్డాడు.
——-————-————-————-——
సేమ్ టు సేమ్ జీవితంలోకూడా
భగవంతుడు పై నుంచి మనతో కనెక్టు అవుదామని,కమ్యునికేట్ చేద్దామనుకున్నప్పుడు ఇలాగే ప్రయత్నిస్తాడు
కానీ క్రింద ప్రాపంచిక విషయాలతో బిజీగా ఉంటాం
అప్పుడు ఆయన మనకు చిన్నవి,పెద్దవి బహుమతులు ఇస్తాడు…అప్పుడైనా చూస్తామేమే అని
అయితే మనం వాటిని చక్కగా తీసుకుని వాటిని ఎంజాయ్ చేస్తూంటాం కానీ ఎవరు పంపారా అని పట్టించుకోం…భగవంతుడుకు కృతజ్ఞత కూడా చెప్పం…మన అదృష్టం బాగుంది. భలే లక్కి మనం మురసిపోతాం..
అప్పుడు ఆయన ఆఖరి ప్రయత్నంగా ఓ రాయిని మన మీదకు విసురుతాడు. దాన్ని మనం సమస్య అంటూంటాం.
అప్పుడు ఎవరు విసిరారా దాన్ని చూసి, అప్పుడు కమ్యూనికేట్ చేయటం మొదలెడతాం…ప్రార్ధనతో..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top