Best Inspirational Story on Patience in Telugu

ఓర్పు ఎంతవరకూ ఉండాలి ?

ఒక ఊరిలో ఒక పుట్ట ఉండేదట.. దానిలో ఒక పాము నివసిస్తుండేది…. అటువైపుగా వెళ్తున్న అందర్నీ అది కరచేదట… కాబట్టి జనం అటువైపుగా వెళ్ళాలన్నా భయపడేవారు.

ఒకసారి అటువైపుగా వెళ్తున్న ఒక ముని నువ్వు ఇలా ఉండకూడదు. ఎవ్వర్నీ హింసించకూడదు అని చెప్పాడు. అప్పటి నుండి అది అలాగే ఉండడం మెదలు పెట్టిందట. అది గమనించిన ఆ ఊరిలోని కొందరు దాన్ని తోకపట్టుకోని కొట్టి హింసించడం మెదలుపెట్టారు…

కొన్నాళ్ళ తరువాత అదే ముని అటుగా వెళ్తూ ఏం పాము ఇలా ఉన్నావు అని అడిగాడు. స్వామి మీరు చెప్పినప్పటి నుండి నేను ఎవ్వరినీ ఏమీ చెయ్యకుండా ఉన్నాను…అందుకు నాకు జరిగిన శాస్తి ఇది అని చెప్పింది.
అప్పుడా ముని……ఓసి… పిచ్చిదానా నిన్ను ఎవర్నీ ఏమీ చెయ్యద్దు అన్నాను గానీ నిన్ను ఇలా చేస్తున్నా భరించమని చెప్పానా ? నువ్వు ఒక్కసారి బుస కొట్టి ఉంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చే వారేనా ? అని అన్నాడు…..
ఈ కధ అందరికీ తెలిసిందేలేండి….. అంటే ఓర్పు అనేది ఉండాలి కానీ మరీ మీకు అన్యాయం జరుగుతున్నాగానీ ఓర్పువహించడం మంచిది కాదు….


అలానే మీరు ఎవర్ని అయినా ఏదైనా అనేటప్పుడు దాని పర్యవసానం ఆలోచించి చెయ్యండి… ఎందుకంటే మీ చేతలవల్ల, మాటల వల్ల ఎవరి మనసైనా కష్టపడితే ఎలాగా ?


పగిలిన అద్దాన్ని అయినా అతికించగలం గానీ విరిగిన మనస్సును అతకలేము..
Cobra-snake-in-india
Cobra-snake-in-india

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top