Sankranthi-Shubhakankhalu-Wishes

Sankranti 2015 Wishes, Wallpapers, Facebook Status Messages, Greetings

రేపు మా ఊరు వెళుతున్నాను సంక్రాంతి పండుగకు..
సంక్రాంతి సెలవలు పిల్లలకు
ఆనందాలు మాత్రం అందరికీ
ఎందుకో ప్రతీ సారి ఇంటికి
వెళ్ళే ముందు మనసంతా ఆనందంతో నిండిపోతుంది!
ఊళ్ళో పండుగ అంటే
చుట్టాలూ పక్కాలూ
ఎక్కడెక్కడో ఉన్నవారదరం ఏడాదికి
ఒక్కసారి కలుసుకునే పెద్ద పండుగ!
రైతు బిడ్డలమైన మాకు
మరీ ఆనందం..పాడిపంటలతో
ఇళ్ళూ వారి మనసులూ
వెలిగే సమయం ఈ సంక్రాంతి!
సంక్రాంతి అంటే ముగ్గులు,కొత్త అల్లుళ్ళ స్వాగతాలు-
హరిదాసుల కీర్తనలూ,గంగిరెద్దుల ఆటలూ
కోడిపందేలు,సోదమ్మి సోది కబుర్లు,
బుడబుక్కల విన్యాసాలతో..ఊరంతా-
కళకళలాడుతూ విరబూసిన నందనవనాన్ని తలపిస్తుంది!
చక్కని వాకిళ్ళు-చిక్కగా చల్లిన కళ్ళాపి
దానిపై తెల్లటి ముగ్గు పిండితో పాతకాలం
ముగ్గు గొట్టాలతో పెద్ద పెద్ద ముగ్గులు
వాటిపై పూలు,నవధాన్యాలు,కూరగాయలూ వేసి
అందంగా అలంకరించిన గొబ్బెమ్మలు!
భోగి మంటలతో నిద్దుర లేచి
భోగి స్నానాలూ,కొత్తబట్టల రెపరెపలు
వాహన పుజ కోసం గుడికి వెళ్ళటం
చక్కని ఫలహారాలతో
అల్పాహారం ఆపై ఊరిపై షికారులు
ఎవరి ముగ్గులు బావున్నాయో చూస్తూ
కలసిన చిన్ననాటి స్నేహితులతో ముచ్చట్లు!
మా ఊరి వేణుగోపాలస్వామి ఊరేగింపు
ఆపై భోజనాలు,భోగిపళ్ళ సంబరాలు
అందరి ఇంటా ఆనంద నందనాలే
మనసంతా నిండిన ఉత్సాహంతో
అందరిలోనూ ఆప్యాతానుబంధాలే!
మనసంతా నిండిన రంగురంగుల
రంగవల్లుల్లాంటి సంతోషాలను
మనసంతా నింపుకుని జ్ఞాపకాలలో
నిక్షిప్తం చేసుకోవటం ఏటేటా
వచ్చే సంక్రంతి కోసం
1000 కళ్ళతో ఎదురుచూడటం!..
మళ్ళీ 19 న కలుసుకుందాం…
మిత్రులందరికీ ముందుగానే సంక్రాంతి పండుగ శుభాకంక్షలు.
Pongal-Celebration-Andhra-Pradesh
Pongal-Celebration-Andhra-Pradesh
Sankranthi-Muggulu
Sankranthi-Muggulu
Sankranthi-Shubhakankhalu-Wishes
Sankranthi-Shubhakankhalu-Wishes
Sankranthi-sweets-rice-kheer-almond-halwa-bobbatlu
Sankranthi-sweets-rice-kheer-almond-halwa-bobbatlu
sankranti-festival-food
sankranti-festival-food
srankanthi-telugu-greetings-wishes
srankanthi-telugu-greetings-wishes
sweet-pongal
sweet-pongal
Wishing-You-a-Happy-Makar-Sankranti-Festival
Wishing-You-a-Happy-Makar-Sankranti-Festival

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top