Save Water Quotes

Save Water – Funny Message but Inspirational

Save-Water-Quotes
Save-Water-Quotes

నీటిని కాపాడుకోండి…లేదా భవిష్యత్తు ఇలా ఉండొచ్చు…చదవండి.
జడ్జి : మీరెందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు..?
భార్య : జడ్జిగారు..! మా ఆయన చాలా సాడిస్టులా ప్రవర్తిస్తున్నారు.. పెళ్ళైనప్పటినుండి “అదనపు నీళ్ళ” కోసం వేధిస్తున్నారు..!

జడ్జి : అదనపు నీళ్ళేంటమ్మా..?
భార్య : అదేనండి.. పెళ్ళైన దగ్గరనుండి పుట్టింటి నుండి అదనపు నీళ్ళు తెమ్మని రోజూ హింసిస్తున్నాడు.. తాగడానికి గుక్కెడు నీళ్ళు కూడా ఇవ్వకుండా నరకం చూపిస్తున్నాడు..
జడ్జి : ఇంక ఆపమ్మా..! మీ కష్టాలు వింటే నాకు కన్నీళ్ళు ఒస్తున్నాయి.. సమయానికి గ్లాసు కూడా లేదు పట్టుకుందాం అంటే.. లేదంటే వేస్టు అవుతాయి.. ఏమయ్యా మీ భార్యకు ఇంత నరకం చూపిస్తావా..?
భర్త : ఏం చేయమంటారండీ.. పెళ్ళప్పుడు 3 లీటర్ల నీళ్ళు పెడతామని చెప్పారు.. పెళ్ళికొచ్చిన వాళ్ళకి ఒక్కో స్పూన్ వాటర్ ఇస్తామన్నారు.. కానీ ఇవ్వలేదు అందరి గొంతు తడారిపోయి మా పరువు పోయింది సరికదా నాకిస్తానన్న 3 లీటర్లలో రెండుంపావు లీటర్లే ఇచ్చారు.. నాకు న్యాయంగా రావాల్సిన ముప్పావు లీటర్లే అడుగాను కానీ హింసించలేదు..!!
జడ్జి : నీళ్ళు కట్నంగా తీసుకోవడం నేరమని నీకు తెలియదా..? మళ్ళీ అదనపు నీళ్ళ కోసం వేధించడం అంతకన్నా పెద్ద శిక్ష తెలుసా..?
భర్త : కాదండీ మా భార్యని ఏడిపిస్తే కనీసం ఆ నీళ్ళతోని అయినా ఒక రెండు రోజులు వాడుకోవచ్చని అనుకున్నాను.. నన్ను క్షమించండి నా భార్యను బాగా చూసుకుంటాను..
జడ్జి : ఏమమ్మా..! మీ భర్త మారిపోయాడు మిమ్మల్ని అదనపు నీళ్ళ కోసం వేధిస్తే నీళ్ళు లేని బావిలో నెల రోజుల కఠిన కారాగార శిక్ష వేసి కఠినంగా శిక్షిస్తాం.. మీకు మీ భర్తతో వెళ్ళడం ఇష్టమేనా..?
భార్య : సరేనండీ.. మీరు చెప్పారు కదా నాకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది..!!
జడ్జి : భార్యాభర్తలిద్దరు అర్దం చేసుకొని కలిసి ఉండడానికి ఇష్టపడ్డారు కనక ఈ కేసు కొట్టివేస్తున్నాం.. ( అబ్బా దాహంగా ఉంది వెళ్ళి ఒక స్పున్ వాటర్ తాగాలి).
ఇది సరదాకే అనిపించినా కఠోర వాస్తవం. తస్మాత్ జాగ్రత్త.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top