Childhood Memories

Childhood Memories, Poems, Quotes, Status Messages in Telugu

ఆ రోజులే బాగున్నాయ్
————————
టెన్షన్లు.. ఒత్తిళ్లు… డబ్బు సంపాదన…
కోసం అతిగా ఆలోచనలు లేకుండా…
ఉన్నంతలో కుటుంబమంతా కలసి…
ఆనందంగా గడిపిన ఆరోజులు బాగున్నాయ్…!
ఆదివారం ఆటలాడుతూ…
అన్నాన్ని మరచిన ఆ రోజులు బాగున్నాయ్…!
మినరల్ వాటర్ గోల లేకుండా…
కుళాయి దగ్గర, బోరింగుల దగ్గర, బావుల దగ్గర…
నీళ్లు తాగిన ఆ రోజులు బాగున్నాయ్…!
ఎండాకాలం చలివేంద్రాల్లోని చల్లని నీళ్లకోసం…
ఎర్రని ఎండను సైతం లెక్కచేయని…
ఆ రోజులు బాగున్నాయ్..!
వందలకొద్దీ చానెళ్లు లేకున్నా…
ఉన్న ఒక్క దూరదర్శన్ లో చిత్రలహరి…
ఆదివారం సినిమా కోసం వారమంతా…
ఎదురు చూసిన ఆ రోజులు బాగున్నాయ్…!
సెలవుల్లో అమ్మమ్మ..నానమ్మల ఊళ్లకు వెళ్లి…
ఇంటికి రావాలన్న ఆలోచనే లేని…
ఆ రోజులు బాగున్నాయ్…!
ఏసీ కార్లు లేకున్నా ఎర్రబస్సుల్లో…
కిటికీ పక్క సీట్లో నుండి ప్రకృతిని..
ఆ స్వాధించిన ఆ రోజులు బాగున్నాయ్…!
మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా…
బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ…
చాక్లెట్లు పంచిన ఆ రోజులు బాగున్నాయ్…!
మటన్ బిర్యానీ.. చికిన్ బిర్యానీ లేకున్నా…
ఎండాకాలం మామిడి కాయ పచ్చడితో…
అందరం కలసి కడుపునిండా అన్నం తిన్న…
ఆ రోజులు బాగున్నాయ్…!
ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా…
పరసు నిండా డబ్బులున్నా…
కొట్టుకు పంపితే మిగిలిన చిల్లర…
కాజేసిన ఆ రోజులే బాగున్నాయ్…!
సెల్లు నిండా గేములున్నా…
బ్యాట్ మార్చుకుంటూ ఒకే బ్యాట్ తో…
క్రికెట్టాడిన ఆ రోజులే బాగున్నాయ్…!
ఇప్పుడు బీరువా నిండా జీన్సు ప్యాంట్లున్నా…
రెండు నిక్కర్లతో బడికెళ్లిన…
ఆ రోజులే బాగున్నాయ్…!
ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా…
పావలా ఆశా చాక్లెట్ తిన్న…
ఆ రోజులే బాగున్నాయ్…!
చిన్న చిన్న మాటలకే దూరం…
పెంచుకుంటున్న ఈ రోజుల్లో…
పిల్లలం కొట్టుకున్నా సాయంత్రంకల్లా…
కలసిపోయిన ఆ రోజులే బాగున్నాయ్…!
ఇప్పుడు ఇంటినిండా తినుబండారాలున్నా…
నాన్న కొనుక్కొచ్చే చిరుతిళ్ల కోసం…
ఎదురు చూసిన ఆ రోజులే బాగున్నాయ్…!
ఇప్పుడు రకరకాల ఐస్ క్రీమ్ లు…
చల్లగా నోట్లో నానుతున్నా అమ్మ…
చీరకొంగు పైసలతో పుల్లఐసు కొనితిన్న…
ఆ రోజులు ఎంతో బాగున్నాయ్…!
పొద్దుపోయేదాకా చేల్లో పనులు చేసుకొచ్చి…
ఎలాంటి చీకూచింత లేకుండా..
ఎండాకాలంలో ఆకాశంలోని చందమామను చూస్తూ…
నిదురించిన ఆ రోజులు బాగున్నాయ్…!
ఆ రోజులు ఎంతో బాగున్నాయ్…
ఆ రోజులు ఎంతో బాగుంటాయ్…
ఎందుకంటే గడచి పోయిన ఆ రోజులు…
మళ్లీ తిరిగి రావు కాబట్టి…!!
Childhood Memories
Childhood Memories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top