డబ్బుతోనూ , అధికారం తోనూ పొందలేనివి ప్రేమతో చాలా పొందగలం.

ప్రదీప్ ఎప్పుడూ ఒక ముసలామె దగ్గర కమలాలు కొంటాడు .
.
ఆ రోజు కూడా కొన్నాడు . ఆమెకు డబ్బులు ఇచ్చేశాడు . సంచీలోనుండి ఒక కమలా తీసి వలిచి ఒక తొన తిన్నాడు .
.
” అబ్బా ! ఎంత పుల్లగా ఉందొ ! ఈ పండు వద్దు . నువ్వే తిను ” అంటూ వలిచిన పండును ఆ ముసలామెకు ఇచ్చేశాడు .
.
.
ఆమె మిగిలిన తోనలలోనుండి ఇంకో తోన తీసి తింది .
.
” అదేమిటి బాబూ ! ఇంత తియ్యగానే ఉంటేనూ ! ” అంటూ ఉంటె
,” నాకు ఒద్దు నువ్వే తిను ” అంటూ వచ్చేశాడు .
.
.
కూడా వస్తున్న రాధిక అడిగింది
.
” అదేమిటండీ ! రోజూ ఆమె దగ్గరే కొంటారు . ఆమె తియ్యటివే ఇస్తోంది . అయినా రోజూ పుల్లగా ఉంది అని ఒక పండు వెనక్కి ఇచ్చేస్తారు . అదేమీ తెగులూ ? ”
.
” ఆమె అన్ని పళ్ళను అమ్ముతుంది . కానీ ఒక్కపండు ఎప్పుడూ తినదు . అందుకే మా అమ్మకే పెడుతున్నా అనుకుంటూ రోజూ ఎదో ఒక వంక పెట్టి ఒక పండు ఆమె తినేలా చేస్తున్నా ” కళ్ళల్లో కదులుతున్న కన్నీరు రాధికకు కనబడకుండా దాచుకుంటూ అన్నాడు ప్రదీప్ .
.
..
.
ఇక్కడ పక్కనే పళ్ళు అమ్ముతున్న అతడు అడుగుతున్నాడు .
.
ఏమిటక్కా ! రోజూ ఆయనకు ఎక్కువ పళ్ళు తూస్తావూ ? ఆయనేమో నీకు అందులోంచి ఒకటి తీసి వలిచి ఇస్తాడూ ! ఎందుకు అలా ఎక్కువ తూస్తావూ ?
.
.
” అతను నా మీద ప్రేమతో నేను పళ్ళు తినాలి అని అలా చేస్తున్నాడు . నాకు తెలియదు అనుకుంటున్నాడు . అతడికి నా మీద ఉన్న ప్రేమ వలన ఆ తక్కెడ అలా ఎక్కువ తూగుతుంది అంతే కానీ నేను తూచడం లేదు ” అంది ఆ ముసలామె
.
జీవితం లో ఇటువంటి ఆనందాలు కొద్ది మందికే సాధ్యపడతాయి .
.
డబ్బుతోనూ , అధికారం తోనూ పొందలేనివి ప్రేమతో చాలా పొందగలం.

Woman selling fruits market

2 thoughts on “డబ్బుతోనూ , అధికారం తోనూ పొందలేనివి ప్రేమతో చాలా పొందగలం.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *