దేవుళ్ళకే తప్పలేదు నిందలు -మనమెంత ?

రామాంజనేయ యుద్దం జరిగిందంటే ,
అబద్దమనుకున్నా
కృష్ణార్జునుల యుద్దం జరిగిందంటే ,
కట్టుకధ అనుకున్నా
ఈ మనుషులు ఎవరికైనా తగువులు
జరిగినట్టు కట్టుకధలు వ్రాసే వుంటారనుకున్నా ,
లేకపోతే , ఇద్దరి మంచివాళ్ళ మధ్య
ఇద్దరి స్నేహితుల మధ్య ,
ఇద్దరి గొప్పవాళ్ళ మధ్య ,
ఒక లక్ష్యం కోసం పోరాడిన వారి మధ్య
అసలు గొడవెందుకు ?
నాకు జీవితం మధ్యలో అర్దం అయ్యుంది
ఎంత త్యాగంతో బ్రతికినా ,
ఎంతో సేవ చేసినా , ఎంత కష్టపడి ఏ స్థాయికి
ఎదిగినా , ఎవరికైనా
వారికీ ఆ స్థాయి వ్యక్తులతోనే విమర్శలు ,గొడవలు
ఇది మనకు తెలియజేయాలని, మన మంచికోసం
మన కవులు అలా కట్టుకధ వ్రాసివుంటారు
లేదా దేవుళ్ళే , మనకొక మెసేజ్
అలా అందించి వుంటారు .
దేవుళ్ళకే తప్పలేదు నిందలు -మనమెంత ?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top