ఒక రోజు అడవిలో ఒక చిరుత పులి సిగిరెట్ తాగుతుంది… ఇంతలో అక్కడికి ఒక చిట్టెలుక వచ్చి, “సోదరా ఇలాంటి అలవాట్లు మానెయ్. పద మన అడవి ఎంత అందంగా ఉంటుందో చూపిస్తాను “. సరే అని చిరుత సిగరెట్ పక్కన పడేసి దాని వెంట వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక ఒక ఏనుగు గంజాయి తీసుకుంటూ కనిపించింది. దానికి కూడా అలానే చెప్పి వెంట తీసుకు వెళ్ళింది చిట్టెలుక. ఇంకొంత దూరం వెళ్ళాక ఒక సింహం విస్కీ తాగుతూ కనిపించింది. ఆ సింహానికి కూడా అదే మాట చెప్పింది. సింహం తన చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టి ఆ చిట్టెలుకని నాలుగు పీకింది..
అది చూసి ఏనుగుకి కోపం వచ్చింది.. ” ఎందుకు పాపం దాన్ని అలా కొడతావ్? ”
” ఇది నిన్న కూడా ఇలానే ‘ ‘ తాగి వచ్చి నన్ను 3 గంటలు అడవి అంతా తిప్పింది..Elephant and Mouse
Nenu chadivina best jokes lo idhi okati. Thanks for a good joke.