Love Failure Message

నువ్వు దూరం అయ్యేదాకా నీ ప్రేమ విలువ తెలీలేదు!

దగ్గరున్నతసేపు దాని విలువ తెలీదు అంటుంటే ఏంటో అనుకునేదాన్ని……
నువ్వు దూరం అయ్యేదాకా నీ ప్రేమ విలువ తెలీలేదు …..దగ్గరున్నంతసేపు అనుమాణిస్తూ గోడవపడుతూ నిన్ను అనరాని మాటలన్నాను…..ఇపుడు దూరం పెరిగాక అర్థమైంది నేను పోగొట్టుకున్నది నిన్ను మాత్రమె కాదు నా జీవితాన్ని కూడా అని….
ఏం పాపం చేసానో ప్రతిధీ అందినట్లే అంది చేయి జారిపోతుంది…..నేను ఏది ఇష్టపడినా అది నాకు దక్కదు అనే విషయాన్ని చిన్నప్పుడు నుండి గమనిస్తూనే ఉన్నా…కానీ ఏదో ఒక రోజు తలరాత మారతుందేమో అని ప్రయత్నిస్తూనే ఉన్నా …..మారింది పెనుమార్పు…… కానీ తలరాత కాదు మారింది…..
బ్రతుకు రాత మారింది…..బ్రతకాలన్న కోరిక లేకుండా మారింది……
చిన్నప్పటినుండి పడిన కష్టాలకి …..కన్నీరు తుడిచి తోడుగా ఉండే దైవంలా నువ్వు నా దరి చేరితే ….. ప్రేమతో దగ్గరయ్యాను…..
నీ ప్రేమకు బానిసనయ్యాను….
మరుపు రాని జ్ఞాపకాల్ని మది నిండా నింపుకున్నాను…..కలిసే ఉంటామన్న నమ్మకాన్ని పెంచుకున్నాను….నువ్వు లేనిదే నేను లేను అనేంతగా అభిమానించాను….
నీ స్నేహంతో ఏనాడు కన్నీటి చుక్కని కూడా చూడ లేదు…మన 3 సంవత్సరాల ప్రేమని ఆనందం గా పంచుకున్నాము….అన్ని సంతోషాల్ని పెంచుకున్నాం….ఎన్నో ఆశలు ఎన్నో కలలు ఇవన్నీ మనకు మనం రాసుకున్న రాతలు అన్నీ తీర్చుకోవాలని పులబాట వేసుకున్నాం…..
వీటన్నిటిని భగ్నం చేస్తూ మీ పేరెంట్స్ కల్పనతో ఆశలన్నీ అడిఆశలు చేసేసావ్….నిన్ను నన్ను దూరం చేసి నువ్వు నాకు కనిపించకుండా పోయావు….వస్థావని నిరీక్షిస్తూ నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను….ఇంకా నమ్ముతూనే ఉన్నాను….
ఎందుకో తెలుసా ప్రేమ మీద నమ్మకం తో…
నువ్వు నాలో ఉన్నంత కాలం ఈ ప్రేమ ని నమ్ముతున్నాను …..వద్దనుకుని నువ్వు నన్ను విడిచి నాలో నుండి వెళ్లిన మరుక్షణం ఈ ఊపిరి ఆగిపోతుంది…
ఒకప్పుడు నువ్వు అనేవాడివి గుర్తుందా…
నేను ఎక్కడున్నా నీ గుండె ఆగిపోయే చివరి నిముషంలో అయినా నీ ప్రాణం పోతుందని నాకు తెలిసి పోతుంది రా అప్పుడు నీతో పాటు నా ప్రాణం కూడా పోతుంది అని…..
నిజమేరా ప్రేమకి ఆ శక్తి ఉంది …..
నీ కోసం నేను వేతకని చోటు లేదు తిరకని ప్రదేశం లేదు నువ్వు వచ్చవని తెలిసి నిన్ను కలవడం కోసం నీ ఇంటి చుట్టూ పిచ్చి కుక్కలా తిరిగాను…..కారణం లేకుండా దూరంగా ఉన్న నీవు నా ప్రేమకి దూరంగా ఉన్నావ్ నాకు కాదని తెలుసు….ఎక్కడున్నా నీకు నా బాధ అర్ధమవుతుందని తెలుసు…..
నాతో మాట్లాడకుండా ఉండడానికి నిన్ను నీ పేరెంట్స్ ఎంతలా బెదిరించి ఉంటారో నాకు తెలుసు…..నాతో మాట్లాడలేక వాళ్ళని పోగొట్టుకోలేక నువ్వు ఎంత బాధ పడుతున్నావో నాకు తెలుసు…..వద్దు చిన్ను ఇకపై ఈ బాధ నికొద్దు….
ఏదో ఒక రోజు నా ప్రేమ గాలులు నిన్ను తాకుతాయి అప్పుడు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావు…..నువ్వు వచ్చే సమయానికి నేను ఈ సమాధిలో హాయిగా నిధురిస్తూ ఉంటాను…..
అప్పుడైనా నా ప్రేమ నిజమని నమ్ముతావా చిన్ను……ఈ జన్మకి నీ ప్రేమని పొందే అదృష్టాన్ని నీ పేరెంట్స్ నాకు ఇవ్వరు …..వాళ్ళని నేను నా అమ్మానాన్నల కంటే ఎక్కువగా ప్రేమించాను కానీ మన ప్రేమ వాళ్లకి నచ్చలేదు…..నీ ప్రేమ నా ప్రేమని చేరుకోడానికి కాలం కోసం ఎదురు చూసినా కరునిస్తుందని నమ్మకంలేదు…..
అందుకే నువ్వు ఇలా నా ప్రేమ నిజమని తెలుసుకునే రోజు ఒకటి కచ్చితంగా వస్తుంది…. అప్పుడు ఇలా కన్నీరు కార్చకు నీ కన్నీరు తుడవడానికి నా చేతులు రావు ప్రాణం లేని సమాధికి కళ్ళు కూడా ఉండవు …నువ్వు ఏడిస్తే నా ఆత్మ కూడా ఏడుస్తుంది….
చిన్ను ఎప్పటికి నా ప్రేమ నీకే ఈ జన్మకే కాదు
ప్రతి జన్మలోను నా ప్రేమ నీకోసమే.
Love Failure Message
Love Failure Message

Leave a Comment

Your email address will not be published.