I cant forget you - Telugu love failure message

I Can’t Forget You – Love Failure Message

వేకువలోను రాతిరిలోను కనుల ముందునుండి వెళ్లవు…..
మర్చిపోవాలని ఎంత ప్రయత్నీమ్చినా నా వల్ల కావడం లేదురా….
కళ్ల ముందుంటావ్…..నిధురపోదామంటే కలలోకి వస్తావు….
ఇక ఈ జీవితానికి ప్రశాంతత లేదా ???
అసలు ప్రేమ జోలికి పోవద్దని ఇంట్లోవాళ్ళు హెచ్చరించినా వినకుండా ప్రేమించాను….కాదు కాదు ఆరాధించాను…..
నా జీవితానికి నీ పరిచయం రైలు ప్రయాణం తో కాదు రైలు ప్రమాదం అనాలేమో…
ఆ ప్రమాదం జరగకుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో…..అయినా రైలు ప్రయాణంలో పరిచయమైన మనిషిని జీవితప్రయాణంలోకి ఆహ్వానించడం ఏంటి నా పిచ్చి కాకపోతే…..నా బ్రతుకు అర్ధంతరంగా ఆగిపోవడానికి కారణం ఏ ఆ రైలు ప్రయాణం అని ఇప్పుడు తెలుసుకుని ప్రయోజనం ఏంటి…..
అయినా పాము కాటుతో ఒక్కసారే మరిణిస్తారట….ఈ ప్రేమకాటుకి రోజు చస్తూ బ్రతుకుతున్న……ఒకప్పుడు ప్రేమంటే ట్రాష్ అనుకున్నా ….. ఇప్పుడు ఆ మాయలో నుండి బైట పడలేకున్నా….
నిజంగా మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని మర్చిపోవడం ఇంత కష్టమని తెలీలేదు…..చిన్ను నీ పేరు తలచుకోగానే కళ్ళు కన్నీటితో నిండి పోతున్నాయిరా …..
ఇదేనేమో నీ పై నాకున్న ప్రేమకు నిదర్శనం.
I cant forget you - Telugu love failure message
I cant forget you – Telugu love failure message

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top