Telugu Good Morning Quote With Beautiful Sunrise in Village River

మన ఊరే కాదు దేశమంతా భూగర్భ జలాలు అడుగంటాయి. చేతిలో ఉన్న నీటిని నిర్లక్ష్యంగా పారపోస్తున్నాము.

మన ఊరే కాదు దేశమంతా భూగర్భ జలాలు అడుగంటాయి. చేతిలో ఉన్న నీటిని నిర్లక్ష్యంగా పారపోస్తున్నాము. మరో పక్క పారపోసిన నీటిని తొడటానికి వేల అడుగులు బోర్లు వేస్తున్నాము. అయినా నీరు పడట్లేదని నిట్టూరుస్తున్నాం. మోటార్ వేస్తే కరెంటు బిల్లులు తడిసిమోపెడు.
అసలీ భాదంతా ఎందుకు? రోజూ మనం ఇంట్లో నీటిని మనం ఎవరికివారు జాగ్రత్తగా వాడుకుంటే చాలు. ఇవి చూడండి.
  1. షేవింగ్‌ చేసుకునేటప్పుడు వృథాగా వాష్‌బేసిన్‌ దగ్గర పంపు తిప్పి వదిలేయడం
  2. బ్రష్‌ చేసుకునేటప్పుడు వృథాగా వాష్‌బేసిన్‌ దగ్గర పంపు తిప్పి వదిలేయడం
  3. గిన్నెలు తోమేప్పుడు సింక్‌ దగ్గర పంపు తిప్పి వదిలేయడం
  4. పెద్ద బేసిన్‌లో నీళ్లు పోసి కూరలు, పండ్లు కడిగాకా ఆ నీటిని వృథాగా పారపోయడం
  5. ఎవరైనా వస్తే పెద్దపెద్ద గ్లాసుల్లో మంచినీళ్లు ఇస్తారు. కొంచెం తాగి విడిచిపెట్టేస్తారు. వాటిని ఎంగిలి నీళ్లు అని పారపోస్తారు.
  6. వాహనాలు కడగటానికి విచక్షణ లేకుండా పంపుతో నీళ్ళు కొడతాము.
  7. ఇంటి పైన ట్యాంకు నిండి నీళ్ళు ధారలుగా కారిపోయాకా అప్పుడు వెళ్లి మోటార్ ఆపుతాము.
చివరగా..
సగం తాగిన, కూరలు కడిగిన నీటిని మొక్కల్లోనో, బాత్రూం లోనో వాడుకుందాము తప్ప వేస్ట్ చేయద్దు.
దయచేసి నలుగురితో పంచుకోండి ఈ సందేశాన్ని.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top