ఎదురుచూపెంత మధురం….!
ఈ క్షణమో మరుక్షణమో నువ్వొస్తావని
ప్రతిక్షణాన్నీ ఆస్వాదిస్తూ ఆనందిస్తాను…
ఈ ఎదురుచూపుల ఉరవడితో
బరువెక్కిన కనురెప్పలమాటున
నువ్వు కదలాడుతుంటే…
కనులు మూసి నిన్ను చూడాలో
కనులు తెరిచి ఎదురుచూడాలో
తెలియక సతమతమైపోయే
నన్ను చూసి నవ్వుకుంటావు..!
నాకు మాత్రం… నా ప్రాణాలన్నీ ముడుపుకట్టి
ప్రేమతో నీకు అర్పించాలని ఉంటుంది…
నీకు అది కూడా అపురూపంగానే తోస్తుంది!
నువ్వే ఒక అద్భుతానివి!!
నీ అపురూప, అద్భుత ప్రేమలో నన్ను తడవనివ్వు…
ఇకనైనా నా చెంతకు చేరి
ఆ ఎడబాటుని, ఎడురుచుపుని చెరపనివ్వు.
ప్రతిక్షణాన్నీ ఆస్వాదిస్తూ ఆనందిస్తాను…
ఈ ఎదురుచూపుల ఉరవడితో
బరువెక్కిన కనురెప్పలమాటున
నువ్వు కదలాడుతుంటే…
కనులు మూసి నిన్ను చూడాలో
కనులు తెరిచి ఎదురుచూడాలో
తెలియక సతమతమైపోయే
నన్ను చూసి నవ్వుకుంటావు..!
నాకు మాత్రం… నా ప్రాణాలన్నీ ముడుపుకట్టి
ప్రేమతో నీకు అర్పించాలని ఉంటుంది…
నీకు అది కూడా అపురూపంగానే తోస్తుంది!
నువ్వే ఒక అద్భుతానివి!!
నీ అపురూప, అద్భుత ప్రేమలో నన్ను తడవనివ్వు…
ఇకనైనా నా చెంతకు చేరి
ఆ ఎడబాటుని, ఎడురుచుపుని చెరపనివ్వు.
కదలనంటున్న సమయాన్ని గడపడం ఎంత భారమో కదా…
మరచిపోలేని మనోగతం కనుల ముందే మెదులుతుంటే…
నరకం నాలుగు గోడల నుండి ఆవహించినట్ట్లుంది..
మరచిపోలేని మనోగతం కనుల ముందే మెదులుతుంటే…
నరకం నాలుగు గోడల నుండి ఆవహించినట్ట్లుంది..