Childhood Memories

Childhood Days & Memories of 1990 Kid

పిల్ల పిడుగుల రాకతో నిశబ్ధం వలికే వీధి ఉలిక్కిపడెను,‌,,, వీధికి మేమే రాజులమని ఆడే ఆటలకు తాను తోడయ్యను……!!పక్కింటి దోర జామకాయ, నరాలు తెగే పుల్లటి చింతకాయ కోసం గోడెక్కి, చెట్టెక్కి చేసే దొంగతనం,,,,,, పిల్లిలా పిల్లలమంతా లొట్టలేసిన రుచి ఈ రోజుకి నోరూరెను…..!!!
జ్వరానికి లొంగక అమ్మకు సైతం టోపి పెట్టి గోడదూకి ఆడిన కబడ్డి, తిన్న అమ్మ చేతి దెబ్బ…….. హ హ హ!!! ఎంత తుంటరి పిల్లనో…!!!!
అలసి సొలసి స్నానమాడి, తాత చెప్పేబుర్ర కధకు ఊ కొట్టి మదిలో గీసే ఊహా చిఁతం మరువజాలను……!!!
ఆకలి బాధ మరచి ఆటపాటలలో మునిగిన పసిపిల్లకు, అమ్మ పరుగులు పెడుతూ పెట్టె గోరుముద్ద రుచి అమృతమేగా…..!!!
పండు వెన్నెలలో చల్లగా వీసే పిల్లగాలిలో మడత మంచంపై సేదతీరుతూ చందమామ కౌగిలో కలల ప్రపంచంలోకి జాలువారెను…..!!!!
— తేజస్విని
Childhood Memories
Childhood Memories
Childhood Memories
Childhood Memories
childhood-memories-photography
childhood-memories-photography

2 thoughts on “Childhood Days & Memories of 1990 Kid”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top