Telugu Quote on Father – Nanna Kavitha

నాన్నకి అంకితం …..

అమ్మ .. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది.
నాన్న .. ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు.

జీవితం అమ్మది — జీవనం నాన్నది .

ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది .
ఆకలి విలువ తెలిసెలా నాన్న చేస్తాడు .

అమ్మ భద్రత — నాన్న బాధ్యత .

పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది.
పడినా పైకి లేవాలని నాన్న చెప్తాడు .

నడక అమ్మది — నడవడిక నాన్నది .

తన అనుభవాలను విద్యలా బోధిస్తుంది అమ్మ.
నీ అనుభవమే విద్య అని తెలిసెలా చేస్తాడు నాన్న .

అమ్మ ఆలోచన— నాన్న ఆచరణ.

అమ్మ ప్రేమను నీ పసిప్రాయం నుండే తెలుసుకొగలవు.
కానీ … నాన్న ప్రేమను నువ్వు నాన్నవు అయ్యాకే తెలుసుకోగలవు.

Telugu Quote About Father

Telugu Quotations and kavithalu about Father and Mother. Messages about Father. Father and Mother relationship quotes. Amma Nanna Kavithalu in Telugu language.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *