Nagula Chavithi Pics

Happy Nagula Chavithi to All.

భక్తి శ్రద్ధలతో నాగుల చవితి …. శ్రావణ నాగుల చవితి విశిష్టత …..

పుట్టకు పాలు పోసి, పుట్టకు ప్రదక్షిణ, నమస్కారాలు చేస్తూ ఏం కొరుకోవాలి ….???
నాగుపాము కాటు పొందిన నరుడు మరణించిన పిదప ఆత్మ ఏక్కడికి పోతుంది ….???
ఆంధ్రదేశాన్ని పాలించిన నాగరాజుల వంశం ….
Happy Nagula Chaviti to all
Happy Nagula Chaviti to all
Nagula Chavithi Pics
Nagula Chavithi Pics3
Nagula Chavithi Pics2
 పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ! అనంతాది మహానాగ రూపాయ వరదాయచతుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా !
ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని – ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే … అందులో భాగంగానే ‘ నాగుపాము” ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.
శ్రావణ నాగుల చవితి పండుగ శ్రావణ చతుర్థినాడు జరుపుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘ వెన్నుబాము’ అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో “పాము” ఆకారమువలెనే వుంటుందని “యోగశాస్త్రం” చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ‘ సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ‘ నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ‘ శ్రీమహావిష్ణువు”కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే … ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు. ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేస్తారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖసంతానము; అదే కన్నె పిల్లలు ఆరాధిస్తే! మంచి భర్త లభించునని పలువురి విశ్వాసము. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిదికాదు. యుగాలనాటిది. సౌభాగ్యానికి, సంతానప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల శరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాధలు కానవస్తున్నాయి.
పుట్టకు పాలు పోసి, పుట్టకు ప్రదక్షిణ, నమస్కారాలు చేస్తు ఏం కొరుకోవాలి ….???
నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. అందుచేత నాగుల చవితి రోజున “నాగేంద్రా! మేము మా వంశములో వారము నిన్ను ఆరాధిస్తున్నాము.
నీ పుట్టదరికి నాపాప లొచ్చేరు పాపపుణ్యమ్ముల వాసనే లేని బ్రహ్మస్వరూపులౌ పసికూనలోయి!
కోపించి బుస్సలు కొట్టబోకోయి! నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
చీకటిలోన నీ శిరసు తొక్కేము కసితీర మమ్మల్ని కాటేయబోకు కోవపుట్టలోని కోడెనాగన్న
పగలు సాధించి మాప్రాణాలు దీకు నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
అర్ధరాత్రీవేళ అపరాత్రీవేళ పాపమే యెఱగని పసులు తిరిగేని ధరణికి జీవనాధార మైనట్టి
వాటిని రోషాన కాటేయబోకు నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
అటు కొండ యిటు కొండ ఆ రెంటినడుమ నాగులకొండలో నాట్యమాడేటి దివ్యసుందరనాగ! దేహియన్నాము
కనిపెట్టి మమ్మెపుడు కాపాడవోయి! నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
పగలనక రేయనక పనిపాటలందు మునిగి తేలేటి నా మోహాలబరిణె కంచెలు కంపలూ గడచేటివేళ
కంపచాటున వుండి కొంప దీకోయి! నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
అంటూ పుట్టకు ప్రదక్షిణ, నమస్కారాలు చేయాలని పురోహితులు అంటున్నారు.
నాగు పాముకాటు పొందిన నరుడు మరణించిన పిదప ఆత్మ ఏక్కడికి పోతుంది ….???
”నాగదష్టో సరో రాజన్‌ ప్రాప్యమృత్యుం ప్రజత్యథః అధోగత్వా భవేత్సర్పో నిర్తిషో నాత్ర సంశయః”-
”రాజా! పాముకాటు పొందిన నరుడు మరణించిన పిదప పాతాళ లోకానికి పోయి విషరహితుడై సర్పజన్మ పొందుతా”డని సుమంతుడు చెప్పగా శతానీకుడు పాముకరచినవాని కుటుంబీకులు అతని మోక్షప్రాప్తికి ఏమి చేయాలని ప్రశ్నిస్తే నాగపూజను వివరించినట్లు కథ. కొన్నిచోట్ల నాగపంచమి ప్రాచుర్యం పొందితే, కొన్ని ప్రాంతాల ప్రజలు కార్తీక చతుర్థినాడు నాగపూజ చేయడం పరిపాటి. స్కందపురాణంలో దీనిని ‘శాంతి వ్రతం’ అన్నారు.
హైందవ సంప్రదాయంలోనే గాక జైన బౌద్ధధర్మాల్లోను నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది. అమరావతీ స్తూపంలో ఫణీంద్రుడు పడగవిప్పిన చిత్రాలు ఉన్నాయి. దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంది. శివుడు నాగభూషణుడు, అతని వింటినారి వాసుకి. శ్రీమహావిష్ణువు మేను వాల్చింది నాగతల్పం పైనే. వినాయకునికి సర్పం ఆభరణం, యజ్ఞోపవీతం కూడా. కుమారస్వామి వాహనమైన మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకొని ఉంటాయి.
ఆంధ్రదేశాన్ని పాలించిన నాగరాజుల వంశం ….
”నాగులచవితికి నాగన్న, స్నానం సంధ్యలు నాగన్న పువ్వులు పడగలు నాగన్న మడిబట్టలతో నాగన్న”
ఆంధ్రదేశం దాదాపు 2500 సంవత్సరాల క్రితం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్లు, వారివల్లనే ఈ దేశానికి నాగభూమి అని పేరు ఏర్పడిందని బౌద్ధగాథలు వెల్లడిస్తున్నాయి. సర్పం జాతీయచిహ్నంగా గల ప్రాచీన తెగ నాగులని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఆంధ్రదేశంలో నాగపూజ పరంపరాగతంగా వస్తోంది. శాతవాహనుల నాటి బౌద్ధాచార్యుడు నాగార్జునుని పేరులో నాగశబ్దం ఉంది. నాగవరం, నాగపట్నం, నాగులపాడు మొదలైన గ్రామనామాలు; నాగయ్య, నాగమ్మ వంటి వ్యక్తి నామాలు; నాగులేరు, నాగరం, నాగుల చీర మొదలైన విశేషనామాలు తెలుగునాట ప్రసిద్ధం. అమరావతి స్తూపంలో నాగబు శాసనస్థమైన తొలి తెలుగు మాటగా వేటూరి ప్రభాకరశాస్త్రి గుర్తించారు. మహావిష్ణువు చాతుర్మాస్యానంతరం నిద్రలేచే ఉత్థానేకాదశికి ఈ నాగులచవితి దగ్గరగా ఉన్నందున కార్తీక శుద్ధ చవితి నాడే నాగపూజ ఆంధ్రుల ఆచారం. ఆనాడు జ్యోతిర్మండలంలో అనంత శయనాకృతి కనిపిస్తుందని చెబుతారు.

Leave a Comment

Your email address will not be published.