Story on Helping others – Stories for kids

ఒక సన్యాసి నదిలో స్నానం చేస్తున్నాడు. తేలోకటి నదిలో కొట్టుకుపోతున్నది. సన్యాసి దాని వంక చూసాడు. దాన్ని రక్షించదలచి చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే అది అతన్ని కుట్టింది.కంగారుతో అతడు దాన్ని నీటిలో వదిలాడు.
అయ్యో చచ్చిపోతున్నదే అనిపించింది.మరల దానిని రక్షించాలని బుద్ధి పుట్టింది.చేతిలోకి తీసుకున్నాడు. మళ్లీ అది అతనిని కుట్టింది. తిరిగి దానిని నీటిలో వదిలాడు.
ఎలాగైనా రక్షించాలనుకొని మూడవమారు చేతిలోకి తీసుకుని విసిరి గట్టు మీద వేసాడు. అది జరా జరా నేలమీదికి పాకుతూ పోయింది.
ఇదంతా చూస్తున్న యువకుడొకడు ఆ సన్యాసిని ఇలా అడిగాడు,”అయ్యా! అది విష జంతువని తెలుస్తూనే ఉంది కదా,అది మిమ్మల్ని రెండు సార్లు కుట్టింది. అయినా దాన్ని ఎందుకు రక్షించారు ?”

అందుకు ఆ సన్యాసి,”ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తేలు తన స్వభావాన్ని వదలకుండా కుడుతున్నదే, అలాంటప్పుడు సన్యాసి అయిన నేను పరోపకారం చేయడం అనే నా స్వభావాన్ని ఎందుకు వదులుకోవాలి ?” అని సమాధానమిచ్చాడు.
పరిస్థితుల ప్రభావం వలన, వత్తిడులవలన, ఇబ్బందులవలన వ్యక్తి తన సహజమైన గుణాలను కోల్పోకూడదు.
Hindu-Saint
Hindu-Saint
thelu

Post navigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *