Telugu Poetry

Childhood Days & Memories of 1990 Kid

పిల్ల పిడుగుల రాకతో నిశబ్ధం వలికే వీధి ఉలిక్కిపడెను,‌,,, వీధికి మేమే రాజులమని ఆడే ఆటలకు తాను తోడయ్యను……!!పక్కింటి దోర జామకాయ, నరాలు తెగే పుల్లటి చింతకాయ కోసం గోడెక్కి, చెట్టెక్కి చేసే దొంగతనం,,,,,, పిల్లిలా పిల్లలమంతా లొట్టలేసిన రుచి ఈ రోజుకి నోరూరెను…..!!! జ్వరానికి లొంగక అమ్మకు సైతం టోపి పెట్టి గోడదూకి ఆడిన కబడ్డి, తిన్న అమ్మ చేతి దెబ్బ…….. హ హ హ!!! ఎంత తుంటరి పిల్లనో…!!!! అలసి సొలసి స్నానమాడి, తాత …

Childhood Days & Memories of 1990 Kid Read More »

బాలబానుడి కిరణాలు తాకి తొలి మంచు కరిగేను….!

బాలబానుడి కిరణాలు తాకి తొలి మంచు కరిగేను….! ఈ కొండ కోనలలోని అందాలు దోబూచులాడేను తన పయ్యెదలోనని….!! హోయలు లయలతో, ఒంపులు సొంపులతో ఒలికే నదులన్నీ అన్నీ నాలో కలిసేను అని నింగికి ఎగసేను సంద్రం అనంద కెరటాలతో….!!! నేల జారిన మలి సంధ్యలో తొంగి చూసేను నేలరేడు….!!! తన వెన్నెల దారాలతో పిల్లగాలి మోసే పరిమళలాల మాలను కట్టి పొదుపుకుండేను తన గుండెల్లో కలువరేడై…..!!!

Chandamama Raave Jaabilli Raave – Mother & Son Childhood Poem

చందమామ రావే జాబిల్లి రావే …. అంటూ అమ్మ బువ్వ తినిపిస్తుంటే …… చందమామ వస్తుందో రాదో తెలియదు కానీ…… అమ్మ పిలుపు మనలో నమ్మకానికి పునాది వేస్తుంది … ఆలోచన కలిగిస్తుంది . రాలేదు కదా అని కోప్పడక రోజూ పిలుస్తుంది ఆ పిలుపుతో సహనం నేర్పుతుంది . ఒక్కరోజు అమ్మ పిలవక పోతే పిల్లలే అడుగుతారు లేదా పిలుస్తారు . బూచాడు అని భయపెట్టి భయం నేర్పుతుంది అదిలించి కోప్పడి నడవడిక నేర్పి వ్యక్తిగా …

Chandamama Raave Jaabilli Raave – Mother & Son Childhood Poem Read More »

Telugu Romantic Poetry on Love – Prema Kavithalu

ఎదురుచూపెంత మధురం….! ఈ క్షణమో మరుక్షణమో నువ్వొస్తావని ప్రతిక్షణాన్నీ ఆస్వాదిస్తూ ఆనందిస్తాను… ఈ ఎదురుచూపుల ఉరవడితో బరువెక్కిన కనురెప్పలమాటున నువ్వు కదలాడుతుంటే… కనులు మూసి నిన్ను చూడాలో కనులు తెరిచి ఎదురుచూడాలో తెలియక సతమతమైపోయే నన్ను చూసి నవ్వుకుంటావు..! నాకు మాత్రం… నా ప్రాణాలన్నీ ముడుపుకట్టి ప్రేమతో నీకు అర్పించాలని ఉంటుంది… నీకు అది కూడా అపురూపంగానే తోస్తుంది! నువ్వే ఒక అద్భుతానివి!! నీ అపురూప, అద్భుత ప్రేమలో నన్ను తడవనివ్వు… ఇకనైనా నా చెంతకు చేరి …

Telugu Romantic Poetry on Love – Prema Kavithalu Read More »