Chandamama Raave Jaabilli Raave – Mother & Son Childhood Poem

చందమామ రావే

జాబిల్లి రావే ….
అంటూ అమ్మ బువ్వ
తినిపిస్తుంటే ……
చందమామ వస్తుందో
రాదో తెలియదు
కానీ……
అమ్మ పిలుపు మనలో నమ్మకానికి
పునాది వేస్తుంది …
ఆలోచన కలిగిస్తుంది .

రాలేదు కదా అని కోప్పడక రోజూ పిలుస్తుంది
ఆ పిలుపుతో సహనం నేర్పుతుంది .
ఒక్కరోజు అమ్మ పిలవక పోతే
పిల్లలే అడుగుతారు
లేదా పిలుస్తారు .
బూచాడు అని భయపెట్టి
భయం నేర్పుతుంది
అదిలించి కోప్పడి నడవడిక
నేర్పి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది
బుజ్జగించి లాలి పాడి
ప్రేమను పంచుతుంది పెంచుతుంది
పద్యాలు పాడుతూ
రాని చందమామను పిలవటం
బోలెడు ఊసులు వినిపించటం
మాటల్లోనే అక్షరాలని నేర్పటం
కథల్లో నీతి వాక్యాలు చేర్చటం
ఎన్నో వైవిధ్యమైన పద్దతులు
పిల్లలకు నేర్పటంలో.
Amma-Kavithalu-Mother-poetry-on-Moon
Amma-Kavithalu-Mother-poetry-on-Moon

Post navigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *