పల్లవాసుల జీవనవిధానం vs నగరవాసుల జీవనవిధానం

విసిగి పోయింది ప్రాణం
ఈ కాంక్రీటు అరణ్యపు ఘోషలో
అత్తరు చల్లిన ప్లాస్టిక్ పూవుల సువాసనలలో
జీవం లేని పచ్చటి మొక్కల పచ్చదనాన్నీ
చూసి చూసి వేసారిపోయింది మనసు
వర్షం పడినా మట్టి వాసన రాని నేల
ఎక్కడి నీరక్కడ ఇంకినట్టు
మిల మిల మెరిసే నల్లని తార్రోడ్డులు
ఎంత వెతికినా దొరకని బురద
సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు..
వానలు,చలీ ఏమీ తెలియవు
ఎ.సి ల మాటున వేడిని..
హీటర్ల సాయంతో చలినీ..
గదిలో పరదాల మాటున మనల్నీ..
ప్రక్రుతినీ కూడా దాచేస్తున్నాం
వెండి కొండల మాటునుండి
భానుడి ఆగమనం
పక్షుల కువకువలు
అరవిరిసిన పూల సోయగాలు
సోయగాలు నుండి వచ్చే సువాసనలు
సువాసనలు మోసుకొచ్చే చల్లని గాలి
గాలిలో ఎగిరే తూనీగలు,సీతాకోక చిలకలు
చిలకలు కొట్టిన పళ్ళు
పళ్ళ కోసం పరుగులు పెట్టిన బాల్యం
బాల్యపు కోతికొమ్మచ్చి జ్ఞాపకాలు ఎక్కడా లేవు
ఏమిటో మీ పిచ్చి,చాదస్తం
ఈ కాలంలో కూడా…
అనేవారే కానీ
అవును నాకిష్టం అనే వాళ్ళు
ఎక్కడ వెతికినా దొరకరు.
Village Garden with water
Village Garden with water
Village Garden
Village cots – old
Beautiful garden – buffaloes

Post navigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *