ఒక చోట ఆధ్యాత్మిక సమ్మేళనం జరుగుతూంది. ప్రముఖ స్వామీజీ ఒకరు ప్రసంగిస్తున్నారు.భక్తులంతా పారవశ్యంగా వింటున్నారు.
అకస్మాత్తుగా స్వామీజీ ప్రసంగాన్ని నిలిపివేసి ఓ 50 మందిని వేదిక పైకి పిలిచారు.వారికి గాలి నింపిన బెలూన్లు తలా ఒకటి ఇచ్చి వాటిపై మార్కర్ పెన్ను తో తమ తమ పేరు వ్రాయమన్నారు.భక్తులు అలాగే చేశారు. స్వామీజీ భక్తుల నుంచి ఆ బెలూన్లు వసూలు చేసి పక్కన వున్న మరో చిన్న సమావేశ గది లో వుంచారు.
ఇప్పుడు మీకు 5 నిముషాల సమయం ఇస్తున్నాను.ఈ లోగా మీ పేరు వ్రాసి వున్న బెలూన్ తెచ్చి నాకు ఇవ్వాలి. అలా తెచ్చి ఇచ్చిన వారికి సదా ఆనందం కలిగేలా అనుగ్రహిస్తాను. అన్నారు.
భక్తులు అందరూ ఒకరి ని ఒకరు తోసుకుంటూ బెలూన్లు ఉన్న గది లోకి చొచుకు పోయారు. 5 నిముషాలే సమయం కావడం చేత ఎవరికి వారు తీవ్రంగా ప్రయత్నించి చూస్తున్నారు. చివరి నిముషం లో ఒక వ్యక్తి కి తన పేరు వ్రాసి వున్న బెలూన్ దొరికింది.
……….
వెంటనే మిగతా వారు చేతికి అందిన బెలూన్ తీసుకొని దానిపై వున్న పేరు చదివి,ఆయా వ్యక్తి కి అంద జేయడం మొదలెట్టారు.
అలా అందరికీ సకాలంలో తమ పేరు వ్రాసి వున్న బెలూన్ దొరికింది. అవి స్వామీజి కి తెచ్చి ఇచ్చి స్వామి వారి అనుగ్రహ భాషణం కోసం ఎదురు చూస్తున్నారు.
స్వామీజీ కొనసాగించారు.” ఇదే మన జీవితం లొ ప్రతి రోజు జరుగుతూంటుంది. ప్రతీ వారు ఆనందం కోసం చుట్టూ వెదుకుతున్నారు.కానీ ఆ అనందం ఎక్కడుందో తెలియదు.నిజానికి మన ఆనందం ఇతరుల ఆనందం తో ముడి పడి వుంటుంది.మీరు ఇతరులకు ఆనందం ,సంతోషం ఇవ్వండి.మీకు అదే ఆనందం, సంతొషం తిరిగి లభిస్తాయి.ఇదే జీవితానికి అర్ధం,పరమార్ధం. అని సభికుల హర్షద్వానాల మధ్య ముగించారు.