*బిజినెస్ మేన్ జోక్*
సుబ్బు కు తెలివి జాస్తి అంటారు. అతడు ఒకసారి ఇలా పేపర్లో ప్రకటన ఇచ్చాడు
“ఇరవై ఒకటో శతాబ్దపు అద్భుతమైన ఆవిష్కరణ! పెన్ను, ఇంక్ లేకుండా రాయటమెలా? వివరాలకు కేవలం పది రూపాయలు పంపితే చాలు”
“వేలాదిమంది పది రూపాయలు చొప్పున అతనికి పంపించారు. వారికి సమాధానంగా పంపిన పోష్టుకార్డు మీద ఇలా వుంది:
“పెన్సిల్ ఉపయోగించండి”
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
(స్వాతి వీక్లీలోంచి సూపర్ జోక్ )
ఒక వ్యాపారవేత్త మెడికల్ చెకప్ కి వెళ్ళాడు.
పరీక్ష చేసిన డాక్టర్ ..
” మీరు మీ సమస్యలన్నింటినీ రాత్రిపూట వెంట తెచ్చుకుని
ఒత్తిడికి గురవుతున్నారు.. మీ సమస్యల్ని దూరంగా పెడితే
మీ ఆరోగ్యం బాగుపడుతుంది .. అని సలహా ఇచ్చాడు.
” అది నిజమే నా భార్య పక్క గదిలోకెళ్ళి పడుకునేందుకు
ఒప్పుకోదుగా డాక్టర్ “