10 Funny Telugu Text Jokes

10 Funny Telugu Text Jokes, Comedy Messages, Short Jokes, SMS Jokes, Telugu Jokes in Telugu Language, Funny Messages in Telugu, Telugu Funny Quotes

…. “కుమారి పంకజం “
జడ్జి : ఇదేమిటండి ! 
కుమారి పంకజం అని పిలిస్తే బోనులోకి ముసలమ్మ వచ్చి నిలబడింది ఏమిటి ? 


ప్లీడర్ : ౩౦ సంవత్సరాల క్రితం ఈ కేసు మొదలయినప్పుడు ఆమె కుమారి పంకజమే సార్ !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

“ముళ్లెలా గుచ్చుకున్నాయ్..?”
ఇమేమిటయ్యా…! 
అరికాలినిండా ఇన్నిముళ్లెలా గుచ్చుకున్నాయ్…..? 
మొదట ఒక్కముల్లె గుచ్చుకుంది డాక్టర్…! 
కాని, ముల్లును ముల్లుతోనే తీయాలని ప్రయత్నించడంతో ఇలా అయ్యింది. 
అన్నాడు గుర్నాధం.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
“నువ్వంటే మీ ఆవిడకి చాలా ప్రేమంట కదా…?” 
అడిగాడు సుందర్. 
అవును..!
“ఆమె చీరలు ఎవరూ ఉతికినా కట్టుకోదు. నేను ఉతికితేనే కట్టుకుంటుంది…!!” 
బాధగా చెప్పాడు సూరి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
“తాళి ఏది..?”
భర్త: ఏమే..,
నీ మెడలో తాళి ఏది?


భార్య: మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఫ్రిట్జ్ లో పెట్టానండీ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఒక రోజు భావుక్ ఒక నది ఒడ్డున కూర్చుని, తన ప్రియురాలు వదిలేసిందన్న బాధతో నీళ్లలోకి రాళ్ళు విసురుతున్నాడు…
ఇంతలో నదిలో నుండి ఒక కప్ప బయటకి వచ్చింది….
” ఒరేయ్ ఎదవా… నీ గాళ్ ఫ్రెండ్ చేసిన పాపానికి నా గాళ్ ఫ్రెండ్ బుర్ర పగలకొడతావా? ఒక్క సారి నీళ్ళలోకి రారా… నీ అంతు తేలుస్తా…….”

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పరమేశం భోజనం చేస్తున్నాడు. “కూర ఏడిసినట్టు వుంది….!!!” అన్నాడు.
“నా వంటకి వంక పెడితే అప్పడాల కర్ర తిరగేస్తాను!!” అంది అంబుజం !!
“ఇంట్లొ అప్పడాల కర్ర వుందా??” అని ఆరా తీసాడు పరమేశం.
ఈయనకి ఇప్పుడు అప్పడాల కర్ర ఊసు ఎందుకో అనుకుంటూ….”లేదు, పక్కింటావిడ తీసుకుని వెళ్లింది” అంది అంబుజం ……. తెల్లబోతూ !!
“కూరే కాదు, పచ్చడీ, పులుసూ…అన్నీ దరిద్రంగా వున్నయి” అన్నాడు పరమేశం ఎంతో ధైర్యంగా!!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

టీచర్: అరేయ్ చింటూ… ఒక బుట్టలో 10 మామిడి పళ్ళున్నాయ్.. అందులో 3 కుళ్ళి్పోయాయ్ అనుకో…. ఇంకా ఎన్ని మిగిలుంటాయ్?
చింటూ: 10 టీచర్…
టీచర్: అదేంటిరా?
చింటూ: కుళ్ళిపోయినంత మాత్రాన మామిడి పళ్ళు అరటికాయలు అవ్వవుగా.. అందుకే 10 ఉంటాయ్…..

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
:::::కాలేజ్:::::
వాళ్ళ అబ్బాయిని ఏ కాలేజ్ లో చేర్చాలా అని ఒక తండ్రి ఒక కార్పొరేట్ కాలేజ్ వాచ్ మెన్ ని ఎంక్వైరీ చేస్తున్నాడు. 
“బాబూ..!! ఈ కాలేజ్ మంచిదేనా..??”
వాచ్ మెన్ అన్నాడు, “చాలా మంచిదండి. ఇక్కడ చదివిన వెంటనే చాలా మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. నేను ఈ కాలేజ్ లోనే చదివి, వెంటనే ఈ ఉద్యోగం సంపాదించగలిగాను”.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
స్కూలు స్టాఫ్ రూమ్ లో కూర్చుని టీచర్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు 
“దొంగను మీ బాషల్లో ఏమంటారు అన్నారు తెలుగు టీచర్ 
,” ధీఫ్… అని ఇంగ్లీషు టీచర్. ‘ “చోర్ … అని హిందీ టీచర్ చెప్పగా. మ్యాథమేటీక్స టీచర్ మేము వాళ్ళని.. 


.
.
. 420 అంటము. 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
మోబైల్ ప్రభావం:
అనగనగనగా ఓక సీటీ
ఆ సిటీలో ఓక స్కూలుకెల్లే అబ్బాయి
వాడికి విరోచనాలు అయితే డాక్టర్ దగ్గరకి వెళ్లి లూజ్ మోషన్స్ అని చెప్పడానికి బదులు 
సార్ నాకు ఇవ్వాల పోద్దున నుండి ఫ్రీ.. ఫ్రీ ఔట్ గోయింగ్ అన్లిమిటెడ్ మరియు రకరకాల రింగ్ టోన్స్ ఫ్రీగా వస్తున్నాయి
నా పోట్టలో అసలు బ్యాలెన్స్ లేదు
రీచార్జి చేసినా నిమిషాల్లో నిల్ బ్యాలెన్స్ అవుతుంది
నాకు ఈ ఆఫర్ డీయాక్టివేట్ చేయండి.. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top