కలలో నువ్వేసిన మట్టి గాజులు పగిలిపోయాయబ్బాయ్…. ! – Love Poetry

Matti Gaajulu – Bangles

కలలో నువ్వేసిన మట్టి గాజులు పగిలిపోయాయబ్బాయ్…. !
 చెప్పుకున్న ఊసులు చేసుకొన్న బాసలు ఎగిసే కన్నీటి సంద్రంలో కొట్టుకుపోయాయి….! 
నాటి ఆశలన్నీ నీటి రాతలయ్యాయి…. 
నాడు నీ మమతలో అల్లుకొన్నా పూలతోట నేడు మరుభూమి అయిందబ్బాయ్….! 
ముఖపరిచయం లేని నీతో కలిసి ఎన్నెన్నో ఊహా సౌధాలు నిర్మించాను… 
నాటి వసంతాలు నేడు శిశిరాలయ్యాయి….అయినా నా హృదయం నీ పై ఆస చావనీకుంది… ! 
ఏంటో ఈ పిచ్చి నీతో మట్టి గాజులు వేయించుకోవాలంట…. కుంకుమ దిద్దించుకోవాలంట…! 
రేపన్నది లేని నిశీది కోసం ఆరని అడి ఆశ చూడు..పోనీ ఈ పిచ్చిదాని ఆశ తీర్చకూడదా అబ్బి ..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *