ఊపిరి పోసిన అమ్మ నువ్వు నూరేళ్ళు ఉండాలమ్మా

భూమిపైకి తెచ్చావు నన్ను
ఎముకలిరిగిపొతున్నా,
శ్వాస ఆగిపొతున్నా,
నొప్పి ఎంత వస్తున్నా!!!
ఊపిరి పోసిన అమ్మ నువ్వు నూరేళ్ళు ఉండాలమ్మా,
జీవం ఇచ్చిన అమ్మ నేనంతా నువ్వమ్మా,
అమ్మ అన్న పిలుపే నా ఆరో ప్రాణం,
అమ్మ అన్న పిలుపే ఒక ఆశీర్వచనం,
అమ్మ అన్న పిలుపే ఈ జగతికి జీవన వేదం,
అమ్మ అన్న పిలుపే మన ఆశకు ఆలంబనం…
ఈశ్వరేచ్చ అక్కర్లేదు అమ్మ కమ్మని నోట మాట చాలుగా,
ఆ బ్రహ్మ ఎంత వివేకి తానన్నిట ఉండలేక ఇంటికొక అమ్మనివ్వగా,
ఏ భాష చాలదు అమ్మ గొప్పతనాన్ని వర్ణించగా,
ఏ ఇతరులు తాలలేరు అమ్మ ప్రేమను మరిపింపగా…
అమ్మ ఒడి చల్లగా నీ భాధలన్ని మరువగా,
అమ్మ మనసు వెన్నలా నీ కష్టాలను కరిగించగా,
స్వార్ధముండదు ఆ అనురాగంలో నిస్వార్దమైన ప్రేమ తప్ప,
అవశేషముండదు ఆ మమకారంలో నిశ్చలమైన గారాబం తప్ప…
ఉందా వేరే తియ్యని పదమేదైన అమ్మ అన్న పిలుపు కన్నా,
ఉందా మరొక పుణ్యమేదైనా అమ్మ కాళ్ళకి నమస్కరించడం కన్నా,
తను ప్రత్యేకం నాకెప్పటికి
తన ప్రాముఖ్యం నే మరువనెప్పటికి….
Mothers Love
Mothers Love

Post navigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *