ఇవి ఏమిటో ఎవరికైనా తెలుసా..?

ఇవి ఏమిటో ఎవరికైనా తెలుసా..?
రాయలసీమలో కడప,కర్నూల్, అనంతపూర్ జిల్లాలకు బాగా సుపరిచతమైన “కాంన్చ్సర కాయలు” అనే
కాయగూర ఇది, మిగతా జిల్లాల వాసులకు నాకు తెలిసినంత వరకు పరిచయమే లేదని అనుకొంటున్నాను.
కాకరకాయ లానే ఇది కూడ చెదుగా వుంటుంది, కాని కాకర కాయ సంతతి కాదు. రాయల సీమ వాసులు చాలా
ఇష్టంగా తినే కాయగూర ఇది. వీటిని రెండు విదాలుగా వంటలో వాడతారు.
ఒకటి ః వెల్లుల్లితో తయారు చెసిన పప్పుల పొడి ( పుట్నాల పొడి ) తో వేపుడు చెసుకొంటారు. రాత్రిల్లు తినే జొన్న
రొట్టల్లో ఇదె వేపుడు కలుపుకొని తింటారు. జొన్నె రొట్టే ముక్క తుంచుకొని ఈ కాంన్చ్సర కాయల చుట్టూ చుట్టి
తీసుకొని నోటిలో పెట్టుకొని తింటూంటే వుంటుంది చూడు ఆ మజా……
రెండు ః నీటిలో ఉప్పు వేసి ఉడకబెట్టి తర్వాత రెండు రోజుల దాకా బాగా ఎండలో ఎండబెట్టాక వాటిని ఒక డబ్బాలో
నిలువ వుంచుతారు. ఎప్పుడు కావాలనుకొన్నప్పుడు
 అప్పుడు నూనెలో వడియాల లాగ వేయించుకొని భోజనంలొ
తింటారు. ఇవి ఆరు నెలల నుండి సంవత్సరం దాక నిలువ వుంటాయి చెడిపోకుండా…!!
ఇవి పంటి కింద పడి కరుమ్ కరుమ్ అని నులుగుతూ తింటూంటే ఆ టేస్టే వేరప్ప….!!
అదో రకపు చేదె గాని.. ఆ చెదు కూడ చాలా రుచిగా వుంటుంది.
Kakarakaya
Kakarakaya
Kakarakaya2

Post navigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *