రైతన్న అంటే నాకు అభిమానం, గౌరవం.

తలపాగా చుట్టుకొని……….. చెర్నాకోలా పట్టుకొని ………..
పంచెకట్టుతో ……………….. పొలం గట్టుపై అడుగిడితే చాలు…………..
పుడమితల్లి పులకరించిపోతుంది,
రైతన్న రాజసాన్ని చూసి ……….
లక్షల సూటు బూటులేసుకున్నోళ్ళ కంటే,
నా రాజసాల రైతన్నే గొప్పోడని పరవశించిపోతుంది.
కాడెద్దులకు నాగలిని కట్టి………..
రక్తాన్ని ధారపోసి………. చెమట చుక్కలుగా చిందించి………
ఆరుగాలం కష్టించే రైతన్నను చూసి …………
భూమాతను ముద్దాడే ప్రతి విత్తనమూ……..
రైతన్నకు ప్రణమిల్లుతుంది,
తన తల్లి ఒడిని చేరాననే ఆనందంతో……….!
భూమిని చీల్చుకువచ్చే ………….
పచ్చ పచ్చని మొక్కలన్నీ……….
ఎండ వానలతో పోరాడేందుకు సిద్దపడతాయి,
తమను కన్నబిడ్డల్లా చూసుకొనే………
రైతన్న ఉన్నాడనే ధైర్యంతో………….
ఏ ఆపదొచ్చినా కాపాడతాడనే నమ్మకంతో……!
మట్టి వాసన ఎరిగిన రైతన్న ,
తన కష్టాన్నే ఆరోప్రాణంగా……….
పాడిపంటలనే తన లోకంగా బ్రతుకుతాడు,
అందరి కడుపూ నింపుతూ బ్రతికిస్తాడు.
మకిలి మాటలతో ………….. వెకిలి నవ్వులతో …………..
చేతులు కలిపే పరిచయాలు కావు రైతన్నలవి …………,
గుండె లోతుల్లో…………
ప్రేమతో నిండిన పలకరింపులు రైతన్నలవి …….!
ఆ పిలుపుల్లోనే …………
ఓ ఆప్యాయత ……….., ఓ ఆత్మీయత ……………
తొణికిసలాడుతూ ఉంటుంది.
అందుకే, 
రైతన్న అంటే నాకు అభిమానం 
రైతన్న అంటే నాకు గౌరవం.
 
 
Farmer-cropping
Farmer-cropping
 

Post navigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *